‘శైలజా రెడ్డి అల్లుడు’ సెన్సార్‌ రిపోర్ట్‌

Chaitu Sailaja Reddy Alludu Completes Censor

నాగచైతన్య, అను ఎమాన్యూల్‌ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. వినాయక చవితి శుభాకాంక్షలతో ఈ చిత్రంను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 13న భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంకు సెన్సార్‌ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్‌ను ఇవ్వడం జరిగింది. సెన్సార్‌ బోర్డు వారు ఈ చిత్రంపై పాజిటివ్‌గా రెస్పాండ్‌ అయినట్లుగా కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. తప్పకుండా ఇదో మంచి కమర్షియల్‌ సక్సెస్‌ మూవీగా నిలుస్తుందని, ప్రేక్షకులను అలరిస్తుందని సెన్సార్‌ బోర్డు నుండి టాక్‌ వినిపిస్తుంది.

director maruthi And chitu

‘భలే భలే మగాడివోయ్‌’ మరియు ‘మహానుభావుడు’ చిత్రాలతో విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి ఈ చిత్రంతో మరోసారి తన సక్సెస్‌ జోష్‌ను కొనసాగించబోతున్నాడు. ఈ చిత్రంతో మారుతి అక్కినేని హీరో నాగచైతన్యకు కెరీర్‌లోనే బెస్ట్‌ మూవీని ఇవ్వనున్నాడు అంటూ అక్కినేని అభిమానులు చెబుతున్నారు. భారీ ఎత్తున ఈ చిత్రంను విడుదల చేసేందుకు అత్యధిక థియేటర్లను బుక్‌ చేశారు. గీత గోవిందం చిత్రం తర్వాత అంతటి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న చిత్రం ఇంకా రాలేదు. దాంతో ఈ చిత్రంకు మంచి ఓపెనింగ్స్‌ రావడం ఖాయం అని, మంచి టాక్‌ వస్తే భారీగా వసూళ్లు దక్కడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. చైతూకు ఈ చిత్రం సక్సెస్‌ చాలా ముఖ్యం అనే విషయం తెల్సిందే. సెన్సార్‌ రిపోర్ట్‌తో అక్కినేని ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో మూడు రోజుల్లో అసలు ఫలితం తేలబోతుంది.