సుదీర్ బాబు…నన్ను దోచుకుందువటే : ప్రేమ, పెళ్లి, పిచ్చి…!

nannu-dhochukundhu-vate-mov
సుధీర్‌బాబు నటిస్తూ, సొంతంగా నిర్మిస్తున్న చిత్రం నన్ను దోచుకుందువటే. ఆర్‌.ఎస్‌. నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇటీవలే విడుదల చేసిన టీజర్‌లో కాన్సెప్ట్‌ మొత్తం తెలియజేశారు. సుధీర్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మేనేజర్‌గా, అల్లరి చేసే గడుసమ్మాయి సిరి పాత్రలో హీరోయిన్‌ నభానటేష్‌ కనిపించింది. రొమాంటిక్‌ కామెడీ చిత్రంగా రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 21న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఇక మూవీ రిలీజ్ తేది ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు.. దీనిలో భాగంగా ఈరోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు. వీడియోను మీరూ చూడండి.