మహేష్‌ ఇప్పుడు వస్తే ఫలితం ఉంటుందా…?

Nannu Dochukunduvate Movie Success Meet

సుధీర్‌బాబు, నభా నటేష్‌ జంటగా తెరకెక్కిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంకు మంచి మార్కులు పడ్డాయి. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రంకు కలెక్షన్స్‌ నామమాత్రంగా వచ్చాయి. ఇప్పటికే నిర్మాత సుధీర్‌బాబుకు పెట్టిన పెట్టుబడి వచ్చిందని, ఇకపై వచ్చేయన్ని కూడా లాభాలే అంటూ సమాచారం అందుతుంది. సినిమాకు మంచి టాక్‌ వచ్చిన నేపథ్యంలో సినిమా సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అందుకోసం సుధీర్‌ బాబు తాజాగా మహేష్‌బాబును సంప్రదించినట్లుగా తెలుస్తోంది.

mahesh-babu

సుధీర్‌ బాబు ప్రతి సినిమాకు కూడా మహేష్‌ బాబు ఏదో ఒక విధంగా ప్రమోషన్‌ చేస్తూనే ఉంటాడు. తాజాగా ఈ చిత్రం కోసం కూడా సక్సెస్‌ మీట్‌కు వచ్చేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. సినిమా ట్రైలర్‌ బాగుందంటూ లింక్‌ను షేర్‌ చేసిన మహేష్‌బాబు తాజాగా సక్సెస్‌ మీట్‌కు వచ్చి సినిమాకు బజ్‌ పెంచాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే నేడు దేవదాస్‌ చిత్రం విడుదలైన కారణంగా నన్ను దోచుకుందువటే చిత్రానికి ఇంకా వసూళ్లు వస్తాయన్న నమ్మకం లేదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మహేష్‌బాబు వచ్చినా కూడా ఫలితం ఉండక పోవచ్చు అంటూ ప్రచారం జరుగుతుంది.

nannu-dhochukundhuvate-movi