ఆగేది లేదంటున్న సుధీర్‌బాబు…!

Nannu Dochukunduvate Movie released On September 13

అక్కినేని నాగచైతన్య ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం ఆగస్టు 31న విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేసి, వచ్చే నెల 13న వినాయక చవితి శుభాకాంక్షలతో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. అదే రోజున సమంత ముఖ్య పాత్రలో తెరకెక్కిన హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం విడుదల కాబోతుంది. ఈ రెండు చిత్రాలతో పాటు సుధీర్‌బాబు నటించిన స్వయంగా నిర్మించిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. శైలజ రెడ్డి అల్లుడు సెప్టెంబర్‌ 13కు మారడంతో, సుధీర్‌బాబు సినిమా వారం రోజులు వాయిదా పడే అవకాశం ఉందని అంతా భావించారు. కాని తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు ముందుగా అనుకున్న తేదీకే చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

nannu-dhochukuntuvate-allud

సెప్టెంబర్‌ 13న చిత్రం విడుదల వేసి తదుపరి వారం విడుదల చేయాలని శైలజ రెడ్డి అల్లుడు నిర్మాతలు సుధీర్‌బాబును కోరడం జరిగిందని తెలుస్తోంది. కాని ముందు నుండి ప్లాన్‌ చేసుకుని, పబ్లిసిటీ కూడా చేసిన కారణంగా ఇప్పుడు విడుదల వాయిదా వేయలేం అంటూ సుధీర్‌బాబు వారికి తేల్చి చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. సెప్టెంబర్‌ 13న మూడు సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో సినీ వర్గాల్లో కాస్త టెన్షన్‌ వాతావరణం నెలకొంది. గీత గోవిందం చిత్రం హడావుడి అప్పటి వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా ఈ మూడు సినిమాలు మినిమం పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకున్నా మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్‌ పండితులు అంటున్నారు. ఇపపటికే ఈమూడు సినిమాల విడుదల తేదీలు అధికారికంగా ప్రకటన వచ్చిన విషయంలో ఇక వాయిదా చర్చే లేదు అని చెప్పుకోవచ్చు.

nannu-dhochukundhuvate-nagc