సమంత RIP ట్వీట్‌ వివాదాస్పదం…!

Samantha-Tweet-On-Harikrish

హరికృష్ణ అకాల మరణంతో తెలుగు సినిమా ప్రముఖులు అంతా కూడా తమ సంతాపంను వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులు ఎంతో మంది సోషల్‌ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయడం జరిగింది. అందరిలాగే స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా హరికృష్ణ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేయడం జరిగింది. ఆ ట్వీట్‌లో హరికృష్ణ గారు అని కాకుండా కేవలం హరికృష్ణ అంటూ సంభోదించడం జరిగింది. ఆర్‌ఐపీహరికృష్ణ హ్యాష్‌ ట్యాగ్‌ను పోస్ట్‌ చేయడంతో నందమూరి ఫ్యాన్స్‌తో పాటు సామాన్య జనాలు కూడా సమంతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ముందు పెద్దలను ఎలా గౌరవించాలో నేర్చుకో, ఆ తర్వాత సంతాపంను తెలుపు అంటూ భారీ ఎత్తున తన ట్వీట్‌కు రిప్లైలు రావడంతో సమంత తన తప్పును సరిదిద్దుకుంది.

samantha-harikrishna

సమంత తన ట్వీట్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే హరికృష్ణ గారు అంటూ సంభోధిస్తూ ట్వీట్‌ చేయడం జరిగింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమంత మునుపటి ట్వీట్‌ను ప్రింట్‌ స్క్రీన్‌ తీసిన సోషల్‌ మీడియా జనాలు సమంతపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంను వ్యక్తం చేశారు. సమంత మొదటి ట్వీట్‌ ప్రింట్‌ స్క్రీన్‌ వైరల్‌ అవుతుంది. అందుకే సెలబ్రెటీలు సోషల్‌ మీడియాలో ఏదైనా పోస్ట్‌ చేసే ముందు ఒకటికి పది సార్లు చెక్‌ చేసుకోవాలి. సమంత చేసిన తప్పుకు ఇప్పుడు తీవ్ర విమర్శల పాు అవుతుంది. ఈ వివాదం ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి.

samantha