వాహనదారులకి చంద్రబాబు శుభవార్త…!

CM Chandrababu Good News For AP Motorists
ఏపీ  వాహనదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజీల్‌పై పన్ను తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. డీజిల్, పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులో లీటరుకు 2 రూపాయల చొప్పున తగ్గించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాపై భారం పడే అవకాశం ఉంది. కాగా పెట్రోల్ పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ సోమవారం భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.
ap-good-news
ఈ బంద్ లో బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నీ పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చమురు ధరలపై పన్ను తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రస్తుతం పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.1,120 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని అయినా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బాబు  వెల్లడించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవాలని, కేంద్రం కూడా వెంటనే స్పందించి పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని చంద్రబాబు కోరారు.
petrol-diesel-cm