పెళ్ళికి సిద్దమవుతున్న తెలుగు కథానాయిక

పెళ్ళికి సిద్దమవుతున్న తెలుగు కథానాయిక

పెళ్లిపైకి దృష్టిమళ్లిన ప్రముఖనటి ఆదాశర్మ తనకు కాబోయేవాడు ఎలాఉండాలో ముందుగానే చెప్పేసింది. తెలుగు,హిందీ మాత్రమే కాకుండా కోలీవుడ్‌లోనూ ఇదునమ్మఆళు చిత్రంతో తమిళసినిమాకి కూడా పరిచయమైంది.ఏ భాషలోనూ స్టార్‌డంను అందుకోలేకపోయిన ఈ ముంబై ముద్దుగుమ్మ ఫొటో సెషన్స్‌ నిర్వహించుకుంటూ ఆ ఫొటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తూ వార్తల్లో ఉంటుంది.

నేను పెళ్లికి రెడీ, పెళ్లి కొడుకు వేటలో ఉన్నాను అంటూ తన ట్విట్టర్‌లో పేర్కొంది. వచ్చేవాడికి ఈ బ్యూటీ చాలా కండిషన్స్ పెడుతుంది. బయటకు వెళ్లేటప్పుడు మాత్రం సంప్రదాయ దుస్తులు, ఇంటిలో జీన్స్‌ డ్రెస్‌ వేసుకున్నా పరవాలేదు అంటుంది. ఇంకా ఉల్లిపాయలు తినకూడదని, చిరునవ్వు ముఖం మీద చెరగకుండా ముప్పూటలా వంట చేయాలి అని అంటుంది. జాతి, మతం, రంగు, జాతకం, షూ సైజ్, వీసా, ఈతలో ప్రతిభ, ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌ వంటి వాటి గురించి నాకేమీ అభ్యంతరాలు ఉండబోవు అంటూ తేల్చి చెప్పేసింది