పందిపిల్లతో మూవీ…దానికి రీమేకా ?

Adhugo Remake In Tamil

ఇటీవల కొందరు దర్శకనిర్మాతలు జంతువులను ప్రధానపాత్రలో పెట్టి వైవిధ్య‌మైన క‌థ‌లతో సినిమాలను రూపొందిస్తున్నారు. రాజేంద్రుడు గజేంద్రుడు మొదలు మొన్నటి ఈగ దాకా ఇలాంటి చిత్రాలకు మంచి కూడా ఆద‌ర‌ణ లభిస్తోంది. హాలీవుడ్‌లో కూడా జంతువులు ప్రధానపాత్రలో నటించిన సినిమాలు విడుదలయ్యాయి. టాలీవుడ్‌లో ఆ మ‌ధ్య పందిపిల్ల ప్ర‌ధానపాత్ర‌లో ర‌విబాబు అదుగో అనే సినిమాను రూపొందించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి వినూత్నంగా ప్ర‌చారం చేశాడు రవిబాబు. పంది పిల్ల‌కి ప‌ళ్ళు తోమ‌డం, పందిపిల్ల‌తో క‌లిసి పుష‌ప్స్ చేయ‌డం, పందిపిల్లతో క‌లిసి క్యూలో నిలుచోవ‌డం వంటివి చేశాడు.

ఈ చిత్రం కోసం ఏకంగా రెండు సంవ‌త్స‌రాల స‌మయం కేటాయించాడు. కాని అదుగో చిత్రం బాక్సఫీస్ దగ్గర నిరాశపరిచింది. అయితే ప్ర‌స్తుతం త‌మిళంలోను అదుగో కాన్సెప్ట్‌తో ఓ చిత్రం తెర‌కెక్కుతుంది. ‘పన్నికుట్టి’ అనే పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో యోగిబాబు, క‌రుణ ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. అనుచ‌ర‌ణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది. తాజాగా చిత్ర ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేశారు. ఇది చూస్తుంటే అదుగోకి రీమేక్‌గా ఈ చిత్రం చేస్తున్నారా అనే అనుమానం జ‌నాల‌లో క‌లుగుతుంది. మ‌రి త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రం ఎలాంటి ఫ‌లితాన్ని సాధిస్తుందో చూడాలి.