రష్మిక మందన తర్వాత నభా నటేష్‌..!

Tollywood Top Heroine List In Nabha Natesh

‘ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న ‘గీత గోవిందం’ చిత్రంతో స్టార్‌డంను దక్కించుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం రష్మిక మందన్న కోసం వరుసగా ఆఫర్లతో నిర్మాతలు క్యూ కట్టారు. భారీ ఎత్తున ఈమెకు వస్తున్న ఆఫర్లు చూసి స్టార్‌ హీరోయిన్స్‌ కూడా షాక్‌ అవుతున్నారు. రష్మిక వచ్చే ఏడాదికి స్టార్‌ హీరోయిన్‌గా మారిపోవడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా చెబుతున్నారు. రష్మిక తర్వాత నభా నటేష్‌ గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధికంగా చర్చ జరుగుతుంది. ఈమె తాజాగా ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈమె మొదటి సినిమా మంచి విజయాన్ని దక్కించుకోవడంతో పాటు, ఆమె నటనకు మంచి మార్కులు పడటంతో వెంటనే ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి.

ravi teja And nabha natesh

రవిబాబు ‘అదుగో’ చిత్రం నభా నటేష్‌కు మొదటి చిత్రం. కాని ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు. అదుగో చిత్రం తర్వాత కమిట్‌ అయిన నన్ను దోచుకుందువటే చిత్రంతో నభా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నభా నటేష్‌ విమర్శలకు ప్రశంసలు దక్కించుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఈమెకు వెంటనే రవితేజ ఛాన్స్‌ ఇచ్చాడు. త్వరలో అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ ఆ తర్వాత విఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. ఆ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఆ చిత్రంలో హీరోయిన్‌గా నభా నటేష్‌ను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతుంది. విఐ ఆనంద్‌ దర్శకత్వంలో సినిమా అంటే హీరోయిన్‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే మంచి యాక్టింగ్‌ స్కిల్స్‌ ఉన్న నభానటేష్‌ను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఈమెకు ఇంకా పలు మంచి ఆఫర్లు వస్తాయనే నమ్మంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.