అరవింద సమేత మరో పాట కూడా..!

aravinda sametha new song relese

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. ఇటీవలే ఈ చిత్రం ఆడియోను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేయడం జరిగింది. నాలుగు పాటలను మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఎన్టీఆర్‌ మూవీలో నాలుగు పాటలు మాత్రమే ఉండటం ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే చిత్ర యూనిట్‌ సభ్యులు మరో పాటను విడుదల చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక సమయంలో మిగిలి ఉన్న పాటను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Comparisions on NTR Aravinda sametha movie

‘రంగస్థలం’ చిత్రంకు కూడా ఒక పాటను చివర్లో విడుదల చేయడం జరిగింది. తాజాగా ఈ చిత్రంలోని ఒక పాటను సస్పెన్స్‌గా ఉంచారు. త్వరలోనే ఆ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం వంద కోట్లను వసూళ్లు చేయడం ఖాయం అంటూ నందమూరి అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ చిత్రంలోని అయిదవ పాట ఎలా ఉంటుంది, సినిమాకు ఆ పాట ఏ స్థాయిలో హెల్ప్‌ అవుతుందనేది సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.