బుల్లితెర పై ‘ఆదిపురుష్’ రికార్డ్స్ ?

బుల్లితెర పై ‘ఆదిపురుష్’ రికార్డ్స్ ?
Cinema News

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ మైథలాజికల్ సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ ‘ఆదిపురుష్’ బుల్లి తెరపై సందడి చేయనుంది. ఈ నెల 29న సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మాలో ఈ సినిమా ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చింది. అలాగే ఓటీటీలో కూడా ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయాన్ని సాధించలేదు. కానీ, బుల్లితెర పై మాత్రం ఈ మూవీ కు భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళతో పాటు పెద్దవాళ్ళు మరియు పిల్లలు కూడా ఈ మూవీ పై ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి, బుల్లితెర పై ఆదిపురుష్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉన్నది .

బుల్లితెర పై ‘ఆదిపురుష్’ రికార్డ్స్ ?
Prabhas

కాగా ఈ సినిమాలో కృతిసనన్ హీరోయిన్‌గా నటించారు. టీసీరీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రామాయణం లాంటి అత్య‌ద్బ‌త దృశ్య‌ కావ్యాన్ని.. ‘ఆది పురుష్’ అంటూ 3డిలో వచ్చిన ఈ మైథలాజికల్‌ డ్రామాలో 3డి ఎఫెక్ట్స్, ప్రభాస్ – కృతి సనన్ ల నటన, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా ప్రభాస్ ఫాన్స్ ను, చిన్న పిల్లలను చాలా బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు బుల్లితెర ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా మరింతగా ఆకట్టుకోబోతుంది.