అభిమానులకి షాక్ ఇచ్చిన అజిత్‌

అభిమానులకి షాక్ ఇచ్చిన అజిత్‌

అభిమాన తారల పేరుకి ముందు బిరుదు చేర్చి పిలవడానికి అభిమానులు ఇష్టపడతారు. అలా అజిత్‌ అభిమానులు ఆయనకు ‘తల’ అని పెట్టారు. అంటే.. ‘నాయకుడు’ అని అర్థం. కొన్నేళ్లుగా ‘తల’ అనే పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు తనను ‘తల’ అని పిలవొద్దు అని అభిమానులకు విన్నవించుకున్నారు అజిత్‌. మీడియా కూడా ఈ హీరో పేరుని ప్రస్తావించేటప్పుడు ‘తల’ అని రాస్తుంటుంది.

అందుకని మీడియాని కూడా అలా రాయొద్దని కోరారు.‘‘గౌరవనీయులైన మీడియావారు, నా రియల్‌ ఫ్యాన్స్, ఇతరులు.. నా పేరుకి ముందు ఏ బిరుదు జోడించవద్దు. పిలిస్తే అజిత్, అజిత్‌ కుమార్‌ లేక ఏకే  అని పిలవాల్సిందిగా, రాయాల్సిందిగా కోరుతున్నాను’’ అని అజిత్‌ రాసిన లేఖను ఆయన మేనేజర్‌ సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు.