‘హలో’ తర్వాత అఖిల్‌ చేయబోయేది బ్లాక్‌బస్టర్‌..!

akkineni akhil next film with director koratala Siva

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని వారి ప్రిన్స్‌ ‘అఖిల్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఎవరు ఊహించని విధంగా ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో నాగార్జున ఆలోచనల్లో పడ్డాడు. అఖిల్‌ కోసం మంచి కథ అంటూ దాదాపు సంవత్సర కాలం పాటు ఎన్నో కథలు విన్నాడు. చివరకు విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో ‘హలో’ సినిమాను అఖిల్‌తో చేయించాడు. ‘హలో’ సినిమాను స్వయంగా నాగార్జున ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించాడు. అఖిల్‌ కెరీర్‌ను నిర్మించేందుకు నాగార్జున ఏమాత్రం లైట్‌ తీసుకోవద్దని నిర్ణయించుకున్నాడు. అందుకే అఖిల్‌ తర్వాత సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

akkineni hero next movie with koratala shiva

‘హలో’ చిత్రాన్ని డిసెంబర్‌లో క్రిస్మస్‌ కానుకగా విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ‘హలో’ విడుదల కాకుండానే అఖిల్‌ మూడవ సినిమా కన్ఫర్మ్‌ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్‌ హీరోగా కొరటాల శివ ఒక చిత్రాన్ని చేసేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. వరుసగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను అందుకుంటూ టాప్‌ దర్శకుడిగా తనకంటూ ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న కొరటాల శివ ప్రస్తుతం మహేష్‌బాబు హీరోగా ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం తర్వాత చరణ్‌తో ఒక చిత్రాన్ని చేయాల్సి ఉంది. కాని చరణ్‌ ఇతర ప్రాజెక్ట్‌ల వల్ల కొరటాల శివ తర్వాత సినిమాను అఖిల్‌తో కమిట్‌ అయ్యాడు. దాంతో అఖిల్‌కు మూడవ సినిమా బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని దక్కించడం ఖాయం అంటూ అప్పుడే అక్కినేని ఫ్యాన్స్‌ అంచనాలు వేస్తున్నారు.