వరుణ్‌ పై ఆగ్రహం వ్యక్తం చేసిన అలీరెజా

వరుణ్‌ పై ఆగ్రహం వ్యక్తం చేసిన అలీరెజా

బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు హంట్‌ అండ్‌ హిట్‌ టాస్క్‌ ఇచ్చారు. ఇందులో ఇంటి సభ్యులకు వారికి తెలియని, ఇంతవరకూ చూడని వీడియోను ప్లే చేశాడు. దీంతో అందరి రంగు బయటపడింది. ఊసరవెల్లిలా రంగులా మార్చేవారు ఈ దెబ్బతో తెల్లమొహం వేశారు. మొదట బాబా భాస్కర్‌కు అలీ రెజా, రాహుల్‌ వీడియోలను చూపించాడు. అయితే కోపంలో అవన్నీ మామూలే అని బాబా తేలికగా తీసుకున్నాడు. రాహుల్‌తో మాట్లాడుతూ నిజంగా నిన్ను టార్గెట్‌ చేసి ఉంటే ముఖం మీద చెప్తాను అంటూ సంజాయిషీ ఇచ్చుకున్నాడు.

అనంతరం అలీ రెజా ఫోటో ఉన్న కుండను పగలగొట్టాడు. శ్రీముఖికికి..ఆమె ఒక్క నిమిషం కూడా బిగ్‌బాస్‌ గేమ్‌ వదలదు అంటూ మాట్లాడిన అలీ రెజా, డైరెక్ట్‌ ఎలిమినేట్‌ చేయమంటే శ్రీముఖిని లగేజ్‌ సర్దుకోమంటానని చెప్పిన మహేశ్‌ వీడియోలను చూపించాడు. దీంతో వీరావేశంతో బయటికి వచ్చిన శ్రీముఖి మహేశ్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పి అతని ఫొటో కుండకు అతికించి కసితీరా కర్రతో కొట్టి ముక్కలు చేసింది. శివజ్యోతి రాహుల్‌ ఫొటో ఉన్న కుండను పగలగొట్టింది.

రాహుల్‌కు నోటిదూల ఎక్కువ అంటూ మహేశ్‌, శివజ్యోతితో చెప్పుకొచ్చిన వీడియోను బిగ్‌బాస్‌ రాహుల్‌కు చూపించాడు. నేరుగా చెప్పే దమ్ము లేదా అంటూ మహేశ్‌తో వాగ్వాదానికి దిగిన రాహుల్‌. మహేశ్‌ ఫొటో ఉన్న కుండను బద్ధలు కొట్టాడు. వితిక.. వీడియో చూశాక అలీపై సీరియస్‌ అయి అతడి ఫోటో ఉన్న కుండ పగలగొట్టింది.

ఇక అలీ.. వీడియో చూసిన తర్వాత శ్రీముఖితో మాట్లాడుతూ పెళ్లాం కన్నా మొగుడు ఎక్కువ రియాక్ట్‌ అవుతున్నాడంటూ వరుణ్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ కోపాన్నంతా శ్రీముఖి ఫోటో ఉన్న కుండను బద్ధలు కొట్టడంలో చూపించాడు. మహేశ్‌కు.. శ్రీముఖి అతని గురించి నెగెటివ్‌గా మాట్లాడిన  వీడియోను ప్లే చేశాడు. అది చూసిన మహేశ్‌కు చిర్రెత్తుకొచ్చి శ్రీముఖి కుండను ముక్కలు చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. వరుణ్‌.. అలీ ఫొటో ఉన్న కుండను ముక్కలు ముక్కలు చేశాడు.