జపాన్‌ని వణికిస్తున్న హగిబీస్‌ టైఫూన్‌

జపాన్‌ని వణికిస్తున్న హగిబీస్‌ టైఫూన్‌

216కి.మీవేగంతో వస్తున్న పెనుగాలులవల్ల జపాన్‌లోని హోన్షుద్వీపం తుపానుధాటికి తీవ్రంగా దెబ్బతింది. జపాన్‌లో ఈమధ్య వచ్చిన టైఫూన్లలో హగిబీస్‌టైఫూన్‌ ఒకటి.చాలాప్రజలు మృత్యువాత పడుతున్నారు. జపాన్‌ ప్రధాని షింజోఅబే టైఫూన్నుండి ప్రజలను కాపాడేందుకు తమప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు. మిలటరీ,అగ్నిమాపక సిబ్బంది వరదలో చిక్కుకున్న ప్రజలని రక్షించేoదుకు  ప్రయత్నిస్తున్నారు.

దాదాపు 33మంది మరణించారు.15మంది జాడలేకుండా పోయింది.ఈ విధంగా హగిబీస్‌ టైఫూన్‌ జపాన్ ప్రజలని భయబ్రాంతులని చేస్తుంది.భారీగా కురిసిన వర్షాలవల్ల కొండచరియలు విరగడంవల్ల మృతుల సంఖ్య ఇంకాపెరిగే అవకాశంఉంది.లక్షలఇళ్లకు విద్యుత్‌సరఫరా ఆగిపోయింది.పంటలు పరిసరప్రాంతాలు నీటమునిగి విమాన సదుపాయాలు కూడా నిలిపివేయబడ్డాయి.