టాప్‌– 5లో ఉండేది వాళ్ళు ముగ్గురే అని అంటున్న పునర్నవి

టాప్‌– 5లో ఉండేది వాళ్ళు ముగ్గురే అని అంటున్న పునర్నవి

రాహుల్‌ సిప్లిగంజ్‌ నాకు మంచి స్నేహితుడు. మా ఇద్దరిది స్వచ్ఛమైన స్నేహబంధం. నేను రాహుల్‌తో ప్రేమలో ఉన్నానని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. మా గురించి బయట వేరేలా మాట్లాడుకోవడం చూసి చాలా బాధేసిందని చెప్పింది బిగ్‌బాస్‌–3 కంటెస్టెంట్‌ పునర్నవి భూపాలం. ఈ రెండున్నర నెలలు కుటుంబం, స్నేహితులను బాగా మిస్‌ అయ్యానని తెలిపింది. వైల్డ్‌కార్డు ఎంట్రీ అవకాశం వస్తే మాత్రం మళ్లీ ఆనందంగా వెళ్తానని పేర్కొంది. ఒకవేళ హౌస్‌లో ఉండి ఉంటే తప్పకుండా విన్నర్‌ అయ్యేదాన్నని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదంది. ఆమె పంచుకున్న మరిన్ని విశేషాలు..

పదకొండు వారాలు.. పరిచయం లేని ముఖాల మధ్య ఉండటం.. ఫోన్‌ లేదు.. పుస్తకాల్లేవ్‌.. టీవీ లేదు.. కుటుంబ సభ్యులను కలవడానికి వీల్లేదు.. బిగ్‌బాస్‌–3 హౌస్‌లో ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వమున్న ఆమె రెండున్నర నెలల పాటు తన హావభావాలు, అందచందాలు, మాటతీరు, ఆటపాటలతో వీక్షకులను కట్టిపడేసింది. బిగ్‌బాస్‌ టాప్‌–5లో నిలుస్తానని భావించింది. ఓట్లు రాకపోవడమో, మాటతీరో, ముక్కుసూటితనమో తెలియదు గానీ మూడు వారాల ముందే ఎలిమినేట్‌ అయ్యింది. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ వస్తే మాత్రం మళ్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది బిగ్‌బాస్‌– 3 కంటెస్టెంట్‌ పునర్నవి భూపాలం. ఆమె ఇటీవల హౌస్‌ నుంచి బయటికి వచ్చేసింది.బిగ్‌బాస్‌– 3 టాప్‌– 5లో రాహుల్‌తో పాటు వరుణ్, శ్రీముఖి ఉంటారనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు హౌస్‌లో ప్రవర్తించిన తీరు, వారి హావభావాలు, కదలికల్ని దగ్గర్నుంచి చూశాను.

వరుణ్, వితిక నామినేట్‌ చేసినప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాను. నామినేట్‌ చేసినా సరే నాకు కోపం రాలేదు. ఇప్పటికీ వారిద్దరిపై స్నేహభావమే ఉంది. ఎలిమినేట్‌ అయ్యేదాకా ఆ ముగ్గురితో స్నేహం బలంగా ఉండేది. నా కోసం రాహుల్‌ త్యాగం చేయడం బాధ కలిగించింది.రెండున్నర నెలల బిగ్‌బాస్‌ షోలో ఉండటం ఓ చాలెంజ్‌. బయటికి రాగానే ముందుగా డేట్‌.. ఆ రోజు ఏమిటని అడిగా. ఫోన్‌ చూడగానే పాస్‌వర్డ్‌ మరిచిపోయా. ఆ తర్వాత మెసేజ్‌లు చూశా. చాలా మెసేజ్‌లు వచ్చాయి. బయటికి రాగానే ముందుగా డేట్‌ అండ్‌ టైమ్‌ అడిగాను. నా బాడీ, మైండ్‌ చెక్‌ చేసుకున్నా. ఇన్‌స్ట్రాగామ్‌లో చాలా సపోర్ట్‌ వచ్చింది.

వరుణ్, వితిక, రాహుల్, నేను మంచి స్నేహితులం. బిగ్‌బాగ్‌ హౌస్‌లోకి వెళ్లాక మూడు వారాలు చాలా ఇబ్బందిపడ్డాను. రిజర్వ్‌గా ఉండేదాన్ని. మెల్లమెల్లగా ఆత్మవిశ్వాసం పెరిగింది. నా మైండ్‌సెట్‌కు తగినట్లుగా ప్రవర్తించడం మొదలెట్టాను. అందరితో సన్నిహితంగా మెలిగాను. ఒక కుటుంబంగా భావించి అందరితో సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకున్నాను. అందులో ఈ ముగ్గురితో బాగా అనుబంధం ఏర్పడింది. అందులో పుస్తకాలు ఉండవు. ఫోన్లు ఉండవు. టీవీ ఉండదు. పత్రికలు ఉండవు. ఉండేదల్లా కథలు చెప్పుకోవడం, టాస్క్‌ల గురించి ఆలోచించడం. తప్పితే ఇంకో వ్యాపకం ఉండేది కాదు. చాలా ఎడిట్‌ చేసి గంట మాత్రమే ప్రసారం చేస్తారు.