డ్యూయల్ రోల్ లో స్టైలీష్ స్టార్

డ్యూయల్ రోల్ లో స్టైలీష్ స్టార్

అల్లు అర్జున్, సుకుమార్ ల మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయనున్నారట. ఓ పాత్రలో బన్నీ ఉంగరాల జుట్టు, మాసిన గడ్డం తో మాస్ అండ్ డీగ్లామర్ లుక్ లో లారీ డ్రైవర్ గా నటిస్తుండగా మరో పాత్రలో అతను క్లాస్సి బిజినెస్ మెన్ లా కనిపిస్తాడట. ఈ రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో కాక రేపుతోంది. ఇదే కనుక నిజం అయితే బన్నీ మొదటిసారి డ్యూయల్ రోల్ చేసిన సినిమాగా మిగిలిపోతుంది. ఇప్పటివరకు 19సినిమాలో నటించినా, బన్నీ ఒక్క సినిమాలోకి కూడా డ్యూయల్ రోల్ చేయలేదు.ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీకి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు.