“ఆర్ఆర్ఆర్ ” మూవీ గురుంచి మదన్ మాటల్లో

రాజమౌళి సినిమా అంటే నే అంచనాలు భారీగా ఉంటాయి. ఇక ‘బాహుబలి’ లాంటి మెగా మూవీ తర్వాత చేస్తున్న సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో చెప్పేదేముంది.పైగా ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి సూపర్ స్టార్లు హీరోలు.
ఈ చిత్రానికి తమిళంలో మాటలు రాస్తున్న మదన్ కార్కీ. ‘బాహుబలి’కి తమిళంలో మాటలు రాసింది ఇతనే. ఆ చిత్రంలో కాలకేయుల కోసం కిలికి అనే భాషను సృష్టించి సూపర్ పాపులర్ చేసిన ఘనత అతడికే దక్కుతుంది.
‘ఆర్ఆర్ఆర్’ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అభిమానులు ఎగ్జైట్ అయ్యే విషయాలు చెప్పాడు మదన్. ‘బాహుబలి’ స్థాయిలో సినిమా ఉంటుందా అని అడిగితే.. ఆ సినిమాకు ఏమాత్రం తగ్గని విధంగా ఉంటుందని.. ఆ సినిమాకు మించిన భారీతనం ఇందులో ఉంటుందని మదన్ తెలిపాడు. ‘ఆర్ఆర్ఆర్’లో ఇద్దరు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పాత్రల్ని రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దారని.. ఒక పాత్రను మించి ఇంకోటి ఉంటుందని అన్నాడు. ఈ సినిమాలో ఎమోషన్లు పతాక స్థాయిలో ఉంటాయని.. ‘బాహుబలి’ చూశాక రాజమౌళిపై పెరిగిన అంచనాల్ని ఆయన అందుకుంటారని ధీమా వ్యక్తం చేశాడు మదన్.
బాహుబలి’ లాగే ఈ సినిమా కూడా అన్ని భాషల వాళ్లనూ ఆకట్టుకుంటుందని మదన్ తెలిపాడు. మదన్ మాటల్ని విన్న జనాలు ‘ఆర్ఆర్ఆర్’ మీద అంచనాల్ని మరింత పెంచుకోవడం ఖాయం.