క్రాక్ పోలీస్ గా ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్న రవితేజ

క్రాక్ పోలీస్ గా ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్న రవితేజ

శివరాత్రి సందర్భంగా రవితేజ నటించిన క్రాక్ మూవీ టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా.. శృతి హాసన్ చాలా రోజుల తరువాత రవితేజతో జోడీ కట్టింది.

ఇక టీజర్ విషయానికి వస్తే.. మాస్ మహరాజా ఫ్యాన్స్‌ ఆయన నుండి ఎలాంటి యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్‌ కోరుకుంటారో క్రాక్ టీజర్‌లో అదే కనిపిస్తోంది. ఒంగోలులో జరిగే క్రైమ్‌ని అంతం చేయడానికి క్రాక్ పోలీస్‌గా రవితేజ మెస్మరైజ్ చేస్తున్నాడు. విక్రమార్కుడులోని విక్రమ్ రాథోడ్ మళ్లీ వచ్చాడా అన్నట్టుగా పోలీస్ గెటప్‌లో రవితేజ అదరగొడుతున్నాడు.

‘అప్పిగా, తుప్పిగా నువ్వు ఎవరైతే నాకేంట్రా డొప్పిగా’.. అంటూ తనదైన మ్యానరిజంతో రవితేజ చెప్పే డైలాగ్ మాస్ ఆడియన్స్‌తో విజిల్స్ వేయించేదిగా ఉంది. వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని రోల్స్ కీలకంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ టీజర్‌లో రవితేజ మీసాన్ని తన కాలితే శృతి హాసన్ మెలితిప్పే సీన్‌ హైలైట్‌గా ఉంది.ఇక ఈ మూవీ సమ్మర్ కానుకగా మే 8 విడుదల కానుంది.