సుకుమార్ చిత్రంలో నటించనున్న అల్లు అర్జున్

సుకుమార్ చిత్రంలో నటించనున్న అల్లు అర్జున్

అలా వైకుంఠపురంలో లాంటి క్లాస్ చిత్రం తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైనప్పటికీ అల్లు అర్జున్ ఇంకా జాయిన్ అవ్వలేదు. అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ రఫ్ లుక్ లో కనిపించనున్నారు. గుబురు గెడ్డం, మీసాలతో అల్లు అర్జున్ ని సరికొత్తగా చూపించనున్నారు సుకుమార్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుక్కుంది.

అయితే సుకుమార్ ఈ చిత్రంలో అల్లు అర్జున్ లుక్ కోసం చాల కష్టపడుతున్నారు. అయితే బన్నీ లుక్ కోసం ముంబై నుండి ఒక టీం వచ్చినట్లు సమాచారం. కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ దగ్గర లుక్ కి సంబంధించిన అన్ని వారు చేసుకోనున్నారు. అయితే ఇప్పటికే కొన్ని డిజైన్ లని సుకుమార్ కు చూపించినట్లు తెలుస్తుంది. అయితే సుకుమార్ లుక్ ని ఫైనల్ చేయడం ఆలస్యం. ఇక అదే లుక్ తో అల్లు అర్జున్ సినిమా చిత్రీకరణలో పాల్గొనున్నారు.