కలకలం రేపుతున్నయువకుడి సెల్ఫీ వీడియో

కలకలం రేపుతున్నయువకుడి సెల్ఫీ వీడియో

నిజామాబాద్ లో మరొక సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. నేను బ్రతకలేకపోతున్న అంటూ నిజామాబాద్ కి చెందిన నరేష్ అనే యువకుడు ఒక సెల్ఫీ వీడియో తీసి రిలీజ్ చేశాడు. కాగా నిజామాబాద్ కార్పొరేటర్ కోమలి భర్త నరేష్ కుమార్… ఆకాష్ అనే వ్యక్తి తనను చాలా వేధింపులకు గురి చేస్తున్నారని, చాలా టార్చర్ పెడుతున్నారని, తన భార్యను అతడి భార్యగా చెప్పుకుంటు ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు.

అక్కడితో ఆగకుండా చంపేస్తానని బెదిరిస్తున్నారని, నీ భార్య ని తీసుకెళ్ళిపోతానని వేధిస్తున్నాడని ఇక నాకు ఏమి చేయాలో అర్థం కాక చచ్చిపోడానికి నిర్ణయించుకున్నానని, ఇంతటితో తన జీవితం ముగుస్తుందని వీడియో లో చెప్పారు.కాగా నరేష్ కుమార్ భార్య కోమలి ప్రస్తుతం అధికార తెరాస పార్టీ తరపున గత మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇకపోతే ఈ వీడియో ప్రస్తుతానికి వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.