మైత్రీ మూవీమేక‌ర్స్‌తో విజ‌య్ మరో సినిమా

మైత్రీ మూవీమేక‌ర్స్‌తో విజ‌య్ మరో సినిమా

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వాలంటైన్స్ డే స్పెషల్‌గా రిలీజ్ అయిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. రాశిఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం డిజాస్టర్‌ని మూటగట్టుకుంది. అయితే ఈ దెబ్బ నుంచి కోలుకోకముందే హీరో విజయ్‌కి మరో షాక్ తగిలింది.

అయితే విజయ్ డియ‌ర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న సమయంలో మైత్రీ మూవీమేక‌ర్స్‌కి రెండు చిత్రాల కోసం అగ్రిమెంట్ చేసుకున్నారు. త‌మిళ ద‌ర్శకుడు ఆనంద్ అన్నామ‌లై దర్శకుడిగా, మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్‌గా హీరో చిత్రాన్ని విజయతో కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేశారు. అయితే ఈ సినిమా అవుట్‌పుట్ అనుకున్న స్థాయిలో రాకపోవడంతో అనుమానం వ‌చ్చిన మైత్రీ సంస్థ వారు ఈ సినిమాని అర్థాంత‌రంగా ఆపేశార‌ని సమాచారం. అయితే ఇప్పటికే ఈ సినిమా కోసం 5 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని, ఈ సినిమా స్థానంలో మైత్రీ వారికి విజ‌య్ మరో సినిమా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.