కుప్పంలో పర్యటించడానికి ప్రణాలికను సిద్ధం చేసుకున్న చంద్రబాబు

కుప్పంలో పర్యటించడానికి ప్రణాలికను సిద్ధం చేసుకున్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రజా చైతన్య యాత్ర చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా రోజుకొక ప్రాంతంలో పర్యటిస్తూ రాష్ట్ర ప్రజలందరికి కూడా వైసీపీ ప్రభుత్వ అక్రమాలు, ప్రజలపై చేస్తున్న మోసపూరిత కుట్రలు అన్ని కూడా వెల్లడించేందుకు చంద్రబాబు ఈ ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు. కాగా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఈనెల 24, 25 తేదీల్లో పర్యటించడానికి ప్రణాలికను సిద్ధం చేసుకున్నారు. కాగా దాదాపుగా రెండు రోజుల పాటు కుప్పంలోనే పర్యటించడానికి సిద్ధమయ్యారు.

ఇకపోతే ఈనెల 27 న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. దానితో పాటే అదే రోజు ప్రజా చైతన్య యాత్రలో పాల్గొననున్నారు. కాగా ప్రస్తుతానికి ప్రకాశం జిల్లాలో పర్యటన సాగిస్తున్న చంద్రబాబు నాయుడు ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా చైతన్య యాత్ర చేపట్టనున్నారని సమాచారం. కాగా రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్నామనే గర్వం తప్ప ప్రజల కోసం పట్టింపు లేదని, అలాగే ప్రభుత్వ విధి విధానాలను ఎండగడుతూ చంద్రబాబు ఈ యాత్ర చేపట్టారు.