ఎఫ్3 చిత్రం లో మహేష్ వరుణ్ తేజ్

ఎఫ్3 చిత్రం లో మహేష్ వరుణ్ తేజ్

గతేడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయి, భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం ఎఫ్2. ఈ చిత్రంలో వరుణ్ తేజ్, వెంకటేష్ లు హీరోలుగా నటించారు. తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తానని ప్రకటించిన అనిల్ రావిపూడి, ఇపుడు అదే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో మరో స్టార్ హీరో జాయిన్ అవుతాడు అని అనిల్ ముందుగానే చెప్పారు. అంతేకాకుండా ఎఫ్3 టైటిల్ ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది.

అయితే ఆ స్టార్ హీరో రవితేజ అని చాల మంది అనుకున్నారు. అయితే అనూహ్యంగా అనిల్ రావిపూడి మహేష్ పేరుని ప్రస్తావించాడు. మహేష్ ఈ చిత్రానికి సంబంధించి డేట్స్ కూడా ఇచ్చేసాడని సమాచారం. తాజాగా సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ మరోసారి పట్టాలెక్కనుంది. ఎఫ్3 లో మహేష్ సరసన రష్మిక ని తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎఫ్2 చిత్రం తో వరుణ్, వెంకటేష్ లకి మంచి పేరు దక్కింది. ఇపుడు ఈ హీరోలతో మహేష్ నటించడం టాలీవుడ్ లో మంచి పరిణామం అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.