‘నోటా’తో బన్నీకి ఉన్న సంబంధం ఏంటీ…?

Allu Arjun Declined NOTA

విజయ్‌ దేవరకొండ హీరోగా ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తమిళం మరియు తెలుగులో తెరకెక్కిన చిత్రం ‘నోటా’. భారీ అంచనాల నడుమ రూపొంది అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రంను దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ తెరకెక్కించాడు అంటూ నిర్మాత జ్ఞానవేల్‌ రాజా అంటున్నాడు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలోనే ఈ చిత్రానికి అల్లు అర్జున్‌ ఒక సంబంధం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది.

alluarju-nota

అల్లు అర్జున్‌ ‘నాపేరు సూర్య’ చిత్రం చేస్తున్న సమయంలో దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ ఈ చిత్రం కథతో వెళ్లినట్లుగా తెలుస్తోంది. కథ నచ్చిన అల్లు అర్జున్‌ చిన్న చిన్న మాడిఫికేషన్స్‌తో రమ్మన్నట్లుగా సమాచారం. ఈలోపు నాపేరు సూర్య చిత్రం విడుదలై ఫ్లాప్‌ అవ్వడంతో ఈ ప్రయోగంకు బన్నీ నో చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. బన్నీ నో చెప్పడంతో స్వయంగా అల్లు అర్జున్‌ ఈ కథకు విజయ్‌ దేవరకొండ అయితే బాగా సూట్‌ అవుతాడు అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అర్జున్‌ రెడ్డి సినిమాతో మంచి జోష్‌ మీద ఉన్న విజయ్‌ అప్పుడు ఈ సినిమాకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. అల్లు అర్జున్‌ వదులుకున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి.

allu-arjun-vijaydevarakonda