అభిమానికి స్పెషల్ ఆఫర్ ఇచ్చిన అల్లు అర్జున్…….

అభిమానికి స్పెషల్ ఆఫర్ ఇచ్చిన అల్లు అర్జున్.......
Cinema News

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో బన్నీ మేనరిజం.. యాక్టింగ్.. డాన్స్ స్టైల్ ప్రేక్షకులకు బాగా నచ్చేశాయి. ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ ని గెలుచుకున్నారు. అంతేకాకుండా నిత్యం ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉండే బన్నీకి ఇన్ స్టాలో దాదాపు 23.5 మిలియన్స్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. బన్నీ షేర్ చేసే ఒక్క పోస్ట్ కు లక్షల్లో లైక్స్, షేర్స్ వస్తూనే ఉంటాయి . అలాంటి స్టార్ హీరో.. తన లేడీ అభిమానికి బంపర్ ఆఫర్ ఇచ్చారు . ఆ అమ్మాయికి ఇన్ స్టా ఫాలోవర్స్ పెరిగేందుకు తనవంతు సాయం చేశారు . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది.

ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోలో.. ఒక లేడీ అభిమాని ముందు నిల్చున్న బన్నీ.. ‘నీకు బాగా ఫాలోవర్లు రావాలని మంచి వీడియో తీస్తాను. నీకు ఎంతమంది ఫాలోవర్లు కావాలి. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు’ అని అడగ్గా.. ఆ అమ్మాయి 13K ఉన్నారని తెలిపింది. మినిమం ఎంత టచ్ అవ్వాలి ? అని బన్నీ అడిగితే 30K అని ఆ అమ్మాయి చెప్పింది.. దీంతో ఈ వీడియోతో వస్తారా ?.. అని అన్నారు బన్నీ. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది.