సైరా మూవీలో మరో మెగా గెస్ట్‌ అప్పియరెన్స్‌?

Allu Arjun In Sye Raa Narasimhareddy Movie

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ భారీ అంచనాల నడుమ రూపొందుతున్న విషయం తెల్సిందే. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ చిత్రం ఒక ట్రెండ్‌ సెటర్‌గా నిలవాలని కోరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ స్థాయిని ఈ చిత్రం నిరూపించాలని మెగా ఫ్యాన్స్‌ కూడా కోరుకుంటున్నారు. రామ్‌ చరణ్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అమితాబచ్చన్‌, కన్నడకు చెందిన సుదీప్‌, తమిళంకు చెందిన విజయ్‌ ఆంటోనీు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక నటిస్తున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మెగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

 Sye Raa Narasimhareddy Movie

అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య’ చిత్రం తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాకు కమిట్‌ కాలేదు. పలు కథలు విన్న బన్నీ తదుపరి చిత్రానికి ఇంకా డేట్లు ఇవ్వలేదు. ఈ లోపు అల్లు అర్జున్‌ దాదాపు పది రోజుల డేట్లను సైరా మూవీ కోసం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమాలోని ఒక కీలకమైన చిన్న పాత్రను అల్లు అర్జున్‌ చేస్తే బాగుంటుందని దర్శకుడు సురేందర్‌ రెడ్డి అభిప్రాయ పడ్డాడు. అదే విషయాన్ని చిరంజీవి మరియు రామ్‌ చరణ్‌లకు తెలియజేయడం వారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో బన్నీతో సురేందర్‌ రెడ్డి అప్రోచ్‌ అయినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి మూవీలో అదీ సైరా మూవీలో ఛాన్స్‌ రావడంతో అల్లు అర్జున్‌ ఎగిరి గంతేసినంత పని చేశాడట. ఖచ్చితంగా ఇది తనకు గౌరవం అంటూ బన్నీ భావిస్తున్నాడు. 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంను వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాత రామ్‌ చరణ్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.