రాశిఖన్నా చాలా ఆశలు పెట్టుకుంది

Rashi khanna career plans in srinivasa kalyanam Success

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రాశిఖన్నా మొదటి చిత్రంతోనే మంచి మార్కులు దక్కించుకుంది. అయితే ఆ తర్వాత ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో మంచి సక్సెస్‌లు పడలేదు. ఒకటి రెండు చిన్న చిత్రాలు సక్సెస్‌ అయినా కూడా ఈమెకు స్టార్స్‌కు జోడీగా నటించే అవకాశంను తెచ్చి పెట్టలేక పోయాయి. ఈమె గత చిత్రం ‘తొలిప్రేమ’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ చిత్రంలో ముద్దుగుమ్మ రాశిఖన్నా నటనతో పాటు అందంతో అలరించి మంచి మార్కులు దక్కించుకుంది. తాజాగా ఈమె ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో నటించింది.

Srinivasa kalyanam

శ్రీనివాస కళ్యాణం చిత్రంలో రాశిఖన్నాకు అనుకోని అదృష్టంలా వచ్చింది. సాయి పల్లవిని అనుకున్న నిర్మాత దిల్‌రాజు ఆమె ఒప్పుకోక పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాశిఖన్నాను ఎంపిక చేయడం జరిగింది. తొలిప్రేమ చిత్రం సక్సెస్‌ అయినా కూడా రాశిఖన్నాకు పెద్దగా ఆఫర్లు రాలేదు. ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం సక్సెస్‌ అయితే అయినా ఈమెకు ఆఫర్లు వస్తాయేమో చూడాలి. ఇప్పటి వరకు చిన్న చిన్న చిత్రాల్లో నటిస్తూ వస్తున్న రాశిఖన్నా శ్రీనివాస కళ్యాణం తర్వాత స్టార్‌ హీరోల సరసన ఛాన్స్‌లు వస్తాయని ఆశిస్తుంది. దిల్‌రాజు బ్యానర్‌లో చేసిన హీరోయిన్స్‌కు భారీ క్రేజ్‌ దక్కుతుంది. దాంతో ఈ చిత్రం ద్వారా రాశిఖన్నాకు తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు. రాశిఖన్నా కూడా ఈ చిత్రం సక్సెస్‌ అయితే ఇక ముందు తన కెరీర్‌కు ఎలాంటి ఢోకా ఉండదని భావిస్తుంది. మరి ఆమె ఆశలు అడియాశలు అయ్యేనా లేదంటే ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చేనో చూడాలి.