మహాతల్లిని ఏమనాలి ?….భర్తను చంపి…ఆ శవం పక్కనే ప్రియుడితో రాసలీలలు…!

Film Nagar Murder Case Mistery Solved

మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు
మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు
యాడ వున్నాడో కాయాన్ని కంటికి కానరాడు
ఈ మాటలు వింటుంటే నేటి పరిస్థితులు ముందే ఆకళింపు చేసుకుని రచయిత అందే శ్రీ రాసినట్టు అనిపిస్తోంది. ఇవాల్టి రోజున క్షణిక, కామ సుఖాల కోసం తమ జీవితాలనే కాక తమను కట్టుకున్న వారి జీవితాలని కూడా నాశనం చేస్తునంరు కొందరు బరితెగించిన స్త్రీ-పురుషులు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వినపడవనీ, ఇద్దరి ప్రమేయం లేకుండా తప్పు జరగదని చచ్చు సామెతలు చెప్పడం కాదు ఇవాల్టి రోజున జరుగుతున్న విషయాలు విని వాటిని మన, మనకి సంబందించిన వారి మీద ఎటువంటి ప్రబాహవం చూపుతున్నాయో, వారు ఎటువంటి పనులు చేస్తున్నారో కాస్త గమనిస్తూ ఉండాలి.
ఇటీవల ఫిలిం నగర్ లో జరిగిన తాగుబోతు భర్త హత్య కేసులో అనేక సంచలన విషయాలు బయట పడ్డాయి. ఫిలింనగర్‌లోని ఒక బస్తీలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న హాస్పిటల్ హౌస్ కీపర్ జగన్‌ హత్య మిస్టరీనిబంజారాహిల్స్‌ పోలీసులు 24 గంటల్లో సాల్వ్ చేసారు. ఈ హత్యలో మృతిడి భార్య దేవికతో పాటు ఆమె ప్రియుడు తోట బెనర్జీ(32) హస్తం ఉన్నట్లు నిర్థారించారు. ఫిలింనగర్‌లోని జ్ఞాని జైల్‌సింగ్‌ నగర్‌ బస్తీలో బర్త్‌ప్లేస్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న బానోతు జగన్‌(35), దేవిక(30) దంపతులు అద్దెకుంటున్నారు. వీరికి ఎనిమిదేళ్ల కొడుకు ఉదయ్, ఆరేళ్ల కూతురు జ్యోతశ్రీ ఉన్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన తోట బెనర్జి(32) ఫిలింనగర్‌లోని అడ్వాన్‌ సాఫ్ట్‌ బీపీఓలో లైజన్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు.Film Nagar Murder Case Mistery Solved
ఇదే సంస్థలో దేవిక హౌస్‌ కీపింగ్‌ పనిచేసేది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది వివాహేతర బంధానికి దారి తీసింది. తాగుబోతు భర్త బాధలు ఎందుకు ఆమెని నేను రెండో వివాహం చేసుకున్తానంటూ ఏడాది క్రితం బెనర్జి దేవిక తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అడగ్గా వారు అతడు పనిచేస్తున్న సంస్థ వద్దకే వచ్చి కొట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపధ్యంలో దేవిక అక్కడ హౌస్‌కీపింగ్‌ పనుల నుండి మానేసింది. ఉద్యోగం అయితే మానింది కానీ అతనితో ఉన్న తొడ సంబంధాన్ని వాడులుకోలేక పోయింది. భర్త కళ్లుగప్పి తరచూ కలుస్తుండేది. అనుమానం వచ్చిన జగన్‌ పలుమార్లు ఆమెను హెచ్చరించి పరువుతీయవద్దంటూ బతిమలాడేవాడు.
ఇలా అయితే కష్టం అనుకున్న బెనర్జి, దేవిక ఒకే ఇంట్లో అద్దెకుంటే ఈ గొడవ ఉండదని ఎవరికీ అనుమానాలు కూడా రావని భావించి నెలల క్రితం బెనర్జి.. జైల్‌సింగ్‌ నగర్‌లోని ఓ ఇంటిలో జగన్‌ దంపతులను అద్దెకు దిగేలా చేశాడు. తర్వాత రెండు రోజులకే తాను కూడా అదే ఇంటి పెంట్‌హౌస్‌లోకి మారుపేరుతో అద్దెకు దిగాడు. దీంతో ఏ మాత్రం అనుమానం రాకుండా ఇద్దరూ కలుసుకునేవారు. అయితే వారిద్దరికీ అడ్డుగా ఉన్న భర్తను చంపితే అతనినే పెళ్లి చేసుకుని జీవించవచ్చు అనే బలమయిన కోరికతో భర్తను హతమార్చాలని ఇద్దరూ ప్లాన్‌ వేసి సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఇంట్లోకి పిలిపించి నిద్రిస్తున్న జగన్‌ మర్మాంగాలను మీద దేవిక దాడి చేస్తుంటే అతడి ఛాతిపై బెనర్జి కూర్చొని ముఖాన్ని, గొంతును దిన్డుతో మూసి వేసి చంపేందుకు ప్రయత్నించారు.
పాపం అప్పటికే మద్యం మత్తులో ఉన్న జగన్ అరగంట పాటు జగన్‌ ప్రాణం రక్షించుకునేందుకు పెనుగులాడినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే నిద్ర లేచిన పిల్లలు ఇదంతా చూస్తుండడంతో ఈ మహాతల్లి ఇద్దరినీ బాత్‌రూమ్‌లో వేసి గడియ వేసింది. మరో దౌర్భాగామయిన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి చనిపోయాక అతని నోట్లో హిట్ కొట్టి పైశాచికానందం పొందిన ఆ ఇద్దరు మద్యం తాగి ఆ శవం పక్కానుండ గానే శృంగారంలో పాల్గోనట్టు కనుగొన్నారు. ఈ పని అయ్యాక గంట తర్వాత బావ చనిపోయాడంటూ దేవిక తన సోదరుడు రమేష్ కి ఫోన్‌ చేసింది. అప్పటికే బెనర్జీ అక్కడి నుంచి పరారాయయడు. ఈ విషయం పోలీసుకు చేరడంతో వారు అక్కడకు చేరుకోగా దేవిక చేతులకు గాట్లు పెట్టుకొని వారిని నమ్మించేయత్నం చేసి ఫెయిల్ అయ్యింది.
పోలీసులకి అనుమానం వచ్చేది కాదేమో ఎందుకంటే భర్తను తానే చంపానని దేవిక చెబుతుంటే రాత్రి ఓ అంకుల్‌ వచ్చాడని ఆ గడ్డం అంకుల్ గురించి ఎవరికీ చెప్పొద్దని అమ్మ చెప్పిందని వారి కొడుకు ఉదయ్‌ పోలీసులకు చెప్పాడు. ఓ వైపు దేవిక హత్య తానే చేశానని చెబుతుంటే బాలుడు మరొకరు ఉన్నారంటూ చెప్పడంతో పోలీసులు ఆ దిశలోనే దర్యాప్తు చేశారు. మృతుడి బావమరిది రమేష్‌ను విచారించగా ఆరు నెలల క్రితం జరిగిన బెనర్జీ గొడవను ప్రస్తావించడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు మొదలెట్టి అడ్వాన్‌ సాఫ్ట్‌ సంస్థకు వెళ్లి బెనర్జీ గురించి విచారించగా హత్య జరిగిన ఇంటి టెర్రస్‌ పై ఉంటాడని తేలింది. ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. అడ్వాన్‌ సాఫ్ట్‌ కంపెనీ వారి తో ఫోన్‌ చేయించి సెల్‌టవర్‌ సిగ్నల్స్‌ ఆధారంగా బంజారా హిల్స్ టీవీ 9 పక్క సందులో ఓ ఆటోలో దాక్కున్న నిందితుడిని పట్టుకున్నారు.