బన్నీ, త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్‌ మూవీ అప్‌డేట్స్‌…!

Allu Arjun New Film With Trivikram

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ‘అరవింద సమేత’ చిత్రాన్ని తెరకక్కించగా ఈ చిత్రం దసరా సందర్భంగా విడుదలయి మంచి సక్సెస్‌ను సొంతం చేసుకుంది. సహజంగా త్రివిక్రమ్‌ సినిమా అంటేనే ఆసక్తి నెలకొంటుంది. అందుకే స్టార్‌ హీరోలు, అగ్ర నిర్మాతలు సైతం మాటల మాంత్రికుడితో సినిమా చేయడానికి ఆసక్తి కనబర్చుతారు. ప్రస్తుతం ‘అరవింద సమేత’ చిత్ర సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న త్రివిక్రమ్‌ స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో తదుపరి చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. త్రివిక్రమ్‌ బన్నీల కాంబోలో ఇదివరకే ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాలు వచ్చి సక్సెస్‌ సాధించాయి.

alluarjun-movies-telugu

ఇదిరకే రెండు చిత్రాలను చేసి సక్సెస్‌ సాధించిన ఈ కాంబో త్వరలో హ్యాట్రిక్‌ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. గత చిత్రాలు సక్సెస్‌ అవడంతో ఈ హ్యాట్రిక్‌ సినిమాపై అంచనాలు ముందు నుండే నెలకొంటున్నాయి. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్లడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్‌ 11న ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్టుగా సమాచారం అందుతోంది. డిసెంబర్‌లో ప్రారంభించి రెగ్యులర్‌ షూటింగ్‌ను చకాచకా పూర్తి చేయాలని త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. చిత్ర యూనిట్‌ ఈ చిత్రం కోసం హీరోయిన్‌ను వెతికే పనిలో పడ్డారు.

Vempalli Gangadhar Sensational Comments On Aravindha Sametha Movie