సామజవరగమన పాటను మించిపోయే విధంగా బుట్ట బొమ్మ సాంగ్

సామజవరగమన పాటను మించిపోయే విధంగా బుట్ట బొమ్మ సాంగ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో” ఎంత పెద్ద హిట్టయ్యిందో మనం చూసాము.అయితే ఈ చిత్రం వెండితెర మీదకు రాక ముందే సంగీతం పరంగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.యూట్యూబ్ లో విడుదల చేసిన ప్రతీ ఒక్క పాట కూడా రికార్డు స్థాయి వ్యూస్ మరియు లైక్స్ ను సంపాదించుకుంది.

అయితే అవి కేవలం లిరికల్ వీడియోస్ మాత్రమే..సినిమా విడుదలయ్యాక ఒక్కక్కటిగా ఫుల్ వీడియో సాంగ్స్ ను విడుదల చేస్తుండగా వాటికి కూడా అంతే స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమా నుంచి మొదట విడుదల చేసిన “సామజవరగమన” ఎంత పెద్ద హిట్టయ్యిందో సినిమా విడుదల అయ్యాక “బుట్ట బొమ్మ” సాంగ్ విజువల్ గా అంత కన్నా పెద్ద హిట్టయ్యింది.

అందులో భాగం గానే ఇప్పుడు సామజవరగమన పాటను మించిపోయే విధంగా బుట్ట బొమ్మ సాంగ్ కు రెస్పాన్స్ వస్తుంది. సామజవరగమన కు రెండు వారాల్లో 25 మిలియన్ వ్యూస్ మరియు 3 లక్షలకు పైగా లోకేష్ రాగా..బుట్ట బొమ్మ సాంగ్ కు మాత్రం కేవలం 6 రోజుల్లోనే 24 మిలియన్ వ్యూస్ తో పాటుగా ఏకంగా 4 లక్షల లైక్స్ ను సంపాదించుకుని మరోసారి హిట్ గా నిలిచింది.మరి ఈ ఫుల్ వీడియో సాంగ్ ఎన్ని మిలియన్ వ్యూస్ దగ్గర ఆగుతుందో చూడాలి.