మార్మోగిపోతున్న అల్లు అర్జున్ పాట

మార్మోగిపోతున్న అల్లు అర్జున్ పాట

‘సామజవరగమన’ పాట ఇంత త్వరగా విడుదల చేయాలా అనేదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నా కానీ సాంగ్‌ అయితే సూపర్‌హిట్‌ అయిందనడంలో సందేహం లేదు. పాట విడుదలైన దగ్గర్నుంచి యూట్యూబ్‌లో నంబర్‌ వన్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది.

అంతే కాకుండా కేవలం రెండు రోజుల్లోనే పది మిలియన్లు, అంటే కోటి వ్యూస్‌ సాధించింది. ఇప్పటికీ గంటకి లక్షల కొద్దీ వ్యూస్‌ పెరుగుతూనే వున్నాయి. ఆల్రెడీ ఈ పాట అంతటా మార్మోగిపోతోంది. ఇటీవలి కాలంలో భారీ సినిమాలలో ఇంతగా హిట్టయిన పాట లేదంటే అతిశయోక్తి కాదు. ఈ పాట ఇంతగా హిట్టవడంతో సంక్రాంతికి దీనికి పోటీగా వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ బృందం ఒత్తిడికి లోనవుతున్నారు.

ఇప్పుడు వారి నుంచి కూడా ధీటైన పాట రావాలని ఫాన్స్‌ కోరుకుంటున్నారు. అయితే ‘అల వైకుంఠపురములో’కి అచ్చమైన మెలోడీ సాంగ్‌ విడుదల చేస్తే, ‘సరిలేరు నీకెవ్వరు’కి మాత్రం ఊపున్న మాస్‌ పాట విడుదల చేస్తారట. తమన్నాపై తీస్తోన్న ఐటెమ్‌ సాంగ్‌నే త్వరలో లాంఛ్‌ చేయబోతున్నట్టు సమాచారం. మరి ఆ పాటకి స్పందన కూడా ఇదే స్థాయిలో వుంటుందా లేదా అనేది చూద్దాం.