అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మూవీ కథ అదేనా ?

పుష్ప మూవీ తో ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2: ది రూల్ షూటింగ్‌ లో బిజీగా ఉన్నాడు. ఐతే, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో బన్నీ కొత్త ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో, జులాయి, s /o సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టినట్టు అయ్యింది. అయితే, ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. బ‌న్నీతో త్రివిక్ర‌మ్ చేస్తున్న కథలో సోషియో ఫాంట‌సీ అండ్ ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ ఉంటాయని.. మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. బన్నీ పాత్రని చాలా కొత్తగా డిజైన్ చేసారని , ఈ సినిమాలో బన్నీసరికొత్తగా , ఎన్నడూ లేని విధంగా చుస్తారని తెలుస్తోంది. తమ త్రివిక్రమ్ – బన్నీనాలుగో చిత్రాన్ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాము అని మేకర్స్ చెబుతున్నారు. గీతా ఆర్ట్స్ మరియు హారిక & హాసిని క్రియేషన్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్‌ సంగీతం అదించబోతున్నాడు.