శంకర్ కెరీర్ కు 30 ఏళ్లు పూర్తయ్యాయి, ఇండియన్-2, గేమ్ చేంజర్ యూనిట్ సభ్యుల సంబరాలు!

Kollywood director Shankar
Director Shankar

సినిమా రంగంలోకి నటుడిగా అడుగుపెట్టి, దర్శకత్వంలో తారాస్థాయి ఎగసిన దక్షిణాది సూపర్ దర్శకుడు శంకర్ కెరీర్ కు 30 ఏళ్లు పూర్తయ్యాయి. 59 ఏళ్ల శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్, కమల్ హాసన్ తో ఇండియన్-2 చిత్రాలను తెరకెక్కిస్తున్నారు.

ఆయన కెరీర్ 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గేమ్ చేంజర్ ,ఇండియన్-2 చిత్రాల యూనిట్ సభ్యులు సంయుక్తంగా వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాల్లో దర్శకుడు శంకర్ పాల్గొని కేక్ కట్ చేసిన సందర్భంగా శంకర్ కు రెండు సినిమాల యూనిట్ల సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. తన సంతోషాన్ని అందరితో పంచుకున్నారు.మరిన్ని హిట్ సినిమాలతో కెరీర్ కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

శంకర్… వాస్తవానికి సినీ పరిశ్రమకి నటుడు అవ్వాలని వచ్చనని . 80వ దశకంలో సీత ,వసంతరాగం సినిమాలతో నటుడిగా ప్రస్థానం ప్రారంభించిన శంకర్… భారత సినీ పరిశ్రమ గర్వించే గొప్ప దర్శకుడు అవుతాడని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఆయన జెంటిల్మన్ తో మొదలుపెట్టి భారతీయుడు, ప్రేమికుడు,అపరిచితుడు, ఒకే ఒక్కడు, రోబో, రోబో 2.0 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో దర్శకుల్లో సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు.