ఓటిటిలో ‘సామజవరగమన’ హవా..! మాములుగా లేదుగా.

tollywood movie samajavaragamana
samajavaragamana

యంగ్ హీరో శ్రీవిష్ణు, యంగ్ హీరోయిన్ రెబా మౌనిక జంటగా ,రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సామజవరగమన. ఈ సినిమా శ్రీవిష్ణు కెరియర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విడుదలైన మొదటి రోజూ నుండే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 7 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 7 రెట్లు పైగా రాబట్టింది. ఈ చిత్రంలో నరేష్,వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాజీవ్ కనకాల కీలకపాత్రలలో నటించారు.

థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ఈ చిత్రం ఓటిటిలోకి వచ్చేసింది. ఓటీపీ లో కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది సామజవరగమన. ఆహా ఓటీటీలో అత్యంత వేగంగా 40 గంటల్లో 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసిన చిత్రంగా సామజవరగమన నిలిచింది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ పతాకం పై నిర్మించగా.. AK ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రిలీజ్ అయింది.