“ఓం భీమ్ బుష్” ట్రైలర్ డేట్ వచ్చేసింది ?

"Om Bheem Bush" trailer date has arrived?

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలలో, డైరెక్టర్ శ్రీ హర్ష కోనుగంటి దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. వీ సెల్యూలైడ్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ మార్చి 22, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఈ మూవీ నుండి రిలీజైన ప్రచార మూవీ ల కి ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

"Om Bheem Bush" trailer date has arrived?
“Om Bheem Bush” trailer date has arrived?

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో మేకర్స్ ట్రైలర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మూవీ ట్రెయిలర్ ని మార్చి 15, 2024 న సాయంత్రం 4:59 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. సన్నీ MR సంగీతం అందించిన ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.