Election Updates: సీఎం పర్యటనకు ఆంక్షల ఒత్తిళ్లు.. లబోదిబోమంట్టున్న వ్యాపారులు

Election Updates: Sanctions pressures on CM's visit.. Traders like Labodibo
Election Updates: Sanctions pressures on CM's visit.. Traders like Labodibo

నంద్యాల జిల్లా బనగానపల్లిలో గురువారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటన నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుంచే పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. నంద్యాల, కర్నూలు, తాడిపత్రి వైపు వెళ్లే పట్టణంలోని పెట్రోల్బంకు కూడలి వైపు ఎవరినీ అనుమతించలేదు. అక్కడ వ్యాపారాలు చేసుకునే వారిపైనా ఒత్తిళ్లు తెచ్చారు. అడ్డుగా ఉన్నాయని కొన్ని దుకాణాలను ఇతర ప్రాంతాలకు తరలించారు.

ఇంకొన్ని దుకాణాలను చిన్నపాటి బుల్డోజర్లతో వెనక్కి నెట్టేశారు. దీంతో వ్యాపారులు లబోదిబోమన్నారు. బేతంచెర్ల రోడ్డులోని హెలిప్యాడ్ నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలోని సభాస్థలికి ఇదే ప్రధాన మార్గం. సభ అయ్యేంత వరకూ బస్సుల రాకపోకలపైనా ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.