‘పుష్ప 2’లో అల్లు అయాన్ ? నిజమేనా ..!

‘పుష్ప 2’లో అల్లు అయాన్ ? నిజమేనా ..!
Cinema News

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, పుష్ప 2: ది రూల్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో రూమర్లు వినిపించాయి. తాజాగా మరో రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ వారసుడు ‘అల్లు అయాన్’ నటించనున్నట్లు తెలుస్తోంది. అయాన్ కోసం ‘పుష్ప-2’లో ఓ కీలక పాత్రను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

‘పుష్ప 2’లో అల్లు అయాన్ ? నిజమేనా ..!
Pushpa-2 The Rule

అయితే, ఈ వార్త పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పైగా ఈ పుష్ప సీక్వెల్‌ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప 2లో పరిచయం కానున్నాయి. అందుకే, ‘పుష్ప 2’ కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఆగస్టు 15న, 2024లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.