అమ‌ర్‌ ఆక్బ‌ర్ ఆంటోని కాన్సెప్ట్‌ టీజర్‌…

amar akbar anthony pivot teaser

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌, ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం `అమ‌ర్‌ ఆక్బ‌ర్ ఆంటోని`. ఇప్పటికే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ క్రమంలోనే ఈరోజు మరో వీడియో రిలీజ్ చేశారు. శ్రీనువైట్ల పుట్టినరోజు కానుకగా విడుదలైంది ఈ పివట్‌ టీజర్‌ (కాన్సెప్ట్‌ టీజర్‌). ఫస్ట్ లుక్ లో టైటిల్ లోగోతో పాటు టీజర్‌లో మూడు గెటప్స్ లో ఉన్న రవితేజను చూపించారు. ఇందులో రవితేజ.. అమర్‌, అక్బర్, ఆంటోనీగా త్రిపాత్రాభినయం చేస్తున్నారు. రవితేజ ఇలా త్రిపాత్రాభినయం చేస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు. ఈ సినిమా వ‌చ్చే నెల ఐదో తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్టు తెలుస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం టీజర్ మీద మీరూ ఉకా లుక్ వేసెయ్యండి మరి !