రవితేజ, ఇలియానా జంటగా గత కొంత కాలంగా ఫ్లాపులతో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా ఫస్ట్ లుక్ నిన్న విడుదలైంది. మొట్టమొదటి సారి రవితేజ త్రిపాత్రభినయం చేయడం ఇటీవల హ్యాట్రిక్ హిట్స్ సాధించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడిగా శ్రీను వైట్ల, హీరోయిన్గా ఇలియానా చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు.
ఈ ఫస్ట్‌లుక్ లో హీరో పాత్రను మూడు భిన్నమైన గెటప్స్‌లో చూపించాడు దర్శకుడు శీనువైట్ల. ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై ఆసక్తి పెంచేసాడు. ఈ చిత్రంలో సునీల్, లయ, వెన్నెల కిషోర్, రఘుబాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మూడు పేక ముక్కల్లో మూడు భిన్న పాత్రల్లో రవితేజను చూపించారు. 3 నెంబరు పేకలో ముగ్గురిని చూపించారు. ఇంత హైప్ చేస్తుండడంతో సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి.