యోగాంధ్ర (Yogandhra 2025) మాసోత్సవాల సందర్భంగా విజయవాడ బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లో పోలీస్ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ (State Government Chief Secretary K. Vijayanand) ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ.. తనువు, మనసును ఏకం చేసి శరీరం మొత్తాన్ని స్వచ్ఛతతో నింపే దివ్య ఔషధం యోగా అని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ తమ జీవన మార్గంలో యోగా అభ్యసనాన్ని భాగం చేసుకోవాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు.