నా పార్టీ BRS.. నా నాయకుడు KCR

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన కమిషన్ నోటీసులు ఇస్తే.. పార్టీ ఎందుకు కార్యాచరణ తీసుకులేదని పార్టీలోని అగ్రనేతలను కవిత సూటిగా ప్రశ్నించారు. పెద్ద నేతలుగా ఊహించుకునే వారు ఎందుకు స్పందించ లేదని నిలదీశారు. తన పార్టీ బీఆర్ఎస్.. తన నాయకుడు కేసీఆర్ అంటూ కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్ మాత్రమే తన నాయకుడని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ తప్ప.‌. ఇతర నేతల నాయకత్వంలో తాను పనిచేయనని కుండ బద్దలు కొట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న వారిని గౌరవిస్తానని కవిత పేర్కొన్నారు.