ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి కశ్మీర్‌కు అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తరువాత మొదటిసారి ఆయన కశ్మీర్‌కు వెళుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం అక్కడ పర్యటించిన హోం మంత్రి.. గురు, శుక్రవారాల్లో జమ్మూ, పూంచ్‌లో పర్యటించనున్నారు. జాతీయ భద్రత, సరిహద్దుల్లో పరిస్థితులపై స్థానిక పోలీస్ యంత్రాంగం, భద్రతాదళాలతో సమీక్షించనున్నారు. జూలైలో ప్రారంభంకానున్న అమర్‌నాథ్ యాత్రకు భద్రతా సన్నద్థతను అమిత్ షా సమీక్షించనున్నారు.