నట సార్వభౌమ NTR కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళి

విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంజలి ఘటించారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు. నిరుపేదలు, అణగారిన వర్గాలకు సాధికారిత కల్పించేందుకు ఎన్టీఆర్ చేసిన కృషి అద్భుతమని ప్రధాని ప్రశంసించారు.