‘ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారుల భద్రత కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం.. ‘శక్తి’ యాప్ ద్వారా కోటిన్నర మందికి దగ్గరైన పోలీసు సేవలు ఇకపై వాట్సాప్ ద్వారా అందించబోతున్నాం. ఏ మహిళకు ఇబ్బంది వచ్చినా 79934 85111లో సంప్రదిస్తే చాలు.. వెంటనే పోలీసులు పరిష్కరిస్తారు’ అని DGP హరీశ్ కుమార్ గుప్తా భరోసా ఇచ్చారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మంగళవారం ఈ నంబర్ ప్రారంభించిన DGP గుప్తా మాట్లాడుతూ.. ‘మహిళలు, చిన్నారుల జోలికి వస్తే జాగ్రత్త..’ అంటూ హెచ్చరించారు.