‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఫస్ట్‌లుక్…పేకలో రాజా!

Amar Akbar Antony First Look

రవితేజ, ఇలియానా జంటగా గత కొంత కాలంగా ఫ్లాపులతో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా ఫస్ట్ లుక్ నిన్న విడుదలైంది. మొట్టమొదటి సారి రవితేజ త్రిపాత్రభినయం చేయడం ఇటీవల హ్యాట్రిక్ హిట్స్ సాధించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడిగా శ్రీను వైట్ల, హీరోయిన్‌గా ఇలియానా చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు.

Amar Akbar Antony

ఈ ఫ‌స్ట్‌లుక్ లో హీరో పాత్ర‌ను మూడు భిన్న‌మైన గెట‌ప్స్‌లో చూపించాడు ద‌ర్శ‌కుడు శీనువైట్ల‌. ఫ‌స్ట్‌లుక్‌తోనే సినిమాపై ఆస‌క్తి పెంచేసాడు. ఈ చిత్రంలో సునీల్, ల‌య‌, వెన్నెల కిషోర్, ర‌ఘుబాబు, త‌రుణ్ అరోరా, అభిమ‌న్యు సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మూడు పేక ముక్కల్లో మూడు భిన్న పాత్రల్లో రవితేజను చూపించారు. 3 నెంబరు పేకలో ముగ్గురిని చూపించారు. ఇంత హైప్ చేస్తుండడంతో సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి.

Amar Akbar Antony