చిరుతో పాటు నాగ్‌ కూడా అమితాబచ్చన్‌తో..!

amitabh bachchan guest role in nagarjuna and varma movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్న విషయం తెల్సిందే. సినిమా ప్రారంభం సమయంలోనే సైరాలో అమితాబచ్చన్‌ నటించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అమితాబచ్చన్‌ నటించనున్నాడు అనే ప్రకటన రావడంతో సైరాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సురేందర్‌ రెడ్డి పవర్‌ ఫుల్‌ స్క్రిప్ట్‌తో సినిమాను తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు. ఇక చిరంజీవి సైరా చిత్రంతో పాటు నాగార్జున చేయబోతున్న సినిమాలో కూడా అమితాబచ్చన్‌ గెస్ట్‌ రోల్‌ను చేయబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

amitabh bachchan guest role in nagarjuna

ఇటీవలే ‘రాజుగారి గది’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ఇటీవలే వర్మతో సినిమాకు కమిట్‌ అయిన విషయం తెల్సిందే. వర్మతో సుదీర్ఘ విరామం తర్వాత నాగార్జున సినిమా చేస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. శివ కాంబినేషన్‌ రిపీట్‌ అవుతుంది, శివ సినిమా ఫలితం రిపీట్‌ కానుంది అంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో ఆసక్తి, అంచనాలు పెంచేందుకు వర్మ విభిన్నంగా ఆలోచిస్తున్నాడు. ఈ చిత్రంలో అమితాబచ్చన్‌తో చిన్న పాత్ర చేయించాలని వర్మ డిసైడ్‌ అయ్యాడు.

nagarjuna

వర్మకు అమితాబచ్చన్‌కు చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. అమితాబచ్చన్‌ కెరీర్‌ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వర్మతో చేసిన సినిమాలే ఆయన స్థాయిని పెంచాయి. అందుకే వర్మ ఏ సినిమాలో నటించమన్నా, ఎలాంటి సినిమాలో చేయమన్నా కూడా అమితాబచ్చన్‌ కళ్లు మూసుకుని చేస్తాడు. అందుకే నాగార్జున హీరోగా తాను చేయబోతున్న సినిమాలో అమితాబచ్చన్‌ను నటింపజేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే బిగ్‌బి కూడా వర్మకు గ్రీన్‌ స్నిగల్‌ ఇచ్చాడు. నాగార్జున, అమితాబ్‌ల మద్య కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. ‘మనం’ చిత్రంలో అమితాబ్‌ కొన్ని సెకన్లు కనిపించిన విషయం తెల్సిందే.