షాక్‌ ఇచ్చిన రాజమౌళి తండ్రి

hero sunil next movie with rajamouli father Vijayendra Prasad

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ రచయితగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలకు రచయితగా పని చేసిన విజయేంద్ర ప్రసాద్‌ దర్శకుడిగా ఇప్పటి వరకు ‘రాజన్న’ మరియు ‘శ్రీవల్లి’ చిత్రాలను తెరకెక్కించిన విషయం తెల్సిందే. రచయితగా స్టార్‌ ఇమేజ్‌ను దక్కించుకున్న విజయేంద్ర ప్రసాద్‌ దర్శకుడిగా మాత్రం మినిమం సక్సెస్‌ను అందుకోలేక పోయాడు. రెండు సినిమాలు చేసినా కూడా సక్సెస్‌ దక్కలేదనే ఉద్దేశ్యంతో ఇక దర్శకత్వం గురించి ఆలోచించను అంటూ విజయేంద్ర ప్రసాద్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అంటూ ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి.

director

విజయేంద్ర ప్రసాద్‌ గురించి మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదని, ఆయన దర్శకత్వంను వదిలినట్లుగా వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అంటూ తేలిపోయింది. తాజాగా విజయేంద్ర ప్రసాద్‌ ఒక కొత్త సినిమా చర్చల్లో బిజీగా ఉన్నాడు. ఒక మంచి కథను సిద్దం చేసి సునీల్‌కు వినిపించాడని, ఆయన వెంటనే విజయేంద్ర ప్రసాద్‌ దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

SUNIL

హీరోగా సక్సెస్‌ లేక మళ్లీ కామెడీ పాత్రలు చేయాలని చూస్తున్న సునీల్‌కు విజయేంద్ర ప్రసాద్‌ రూపంలో మంచి ఆఫర్‌ వచ్చిందని కొందరు అంటున్నారు. అయితే విజయేంద్ర ప్రసాద్‌తో సినిమా చేయడం వల్ల సునీల్‌కు లాభం ఉంటుందని తాము భావించడం లేదు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి విజయేంద్ర ప్రసాద్‌, సునీల్‌ల కాంబో మూవీ ఫిక్స్‌ అయ్యింది. వచ్చే సంవత్సరం వీరి మూవీ విడుదల అయ్యే అవకాశం ఉంది. వీరిద్దరికి ఈ సక్సెస్‌ చాలా అవసరం, అందుకే ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా సినిమాను చేస్తారని ఆశిద్దాం