‘అకీరా నందన్’ ఎంట్రీ పై స్టార్ రైటర్ క్రేజీ కామెంట్స్

‘అకీరా నందన్’ ఎంట్రీ పై స్టార్ రైటర్ క్రేజీ కామెంట్స్
Cinema News

‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ఈ నెల 20వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కొడుకు అకీరా నందన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. ఇంతకీ, విజయేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడారు అంటే.. రేణు దేశాయ్ గారు మీరు తెలుగు సినిమాలు చేయకపోయినా, తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉన్నారు. ఐతే, మీరు మాత్రం మీ అబ్బాయి అకీరా నందన్ ను హీరోగా చేయాలనీ . అలాగే అకీరా నందన్ చేసే మూవీ లో అతని తల్లి పాత్రను కూడా మీరే చేయాలనేదే నా మాట” అంటూ విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ చేసారు .

‘అకీరా నందన్’ ఎంట్రీ పై స్టార్ రైటర్ క్రేజీ కామెంట్స్
Vijayendra Prasad, Renu Desai

విజయేంద్ర ప్రసాద్ ఈ కామెంట్స్ చేసిన సందర్భంలో ఒక్కసారిగా అక్కడ సందడి పెరిగిపోయింది. విజయేంద్ర ప్రసాద్ ఇంకా మాట్లాడుతూ .. “గతంలో మణిరత్నం గారి ‘నాయకుడు’ వంటి మూవీ ల లో చూస్తూ, ఇలాంటి మూవీ లు తెలుగులో ఎప్పుడు వస్తాయా అనుకునేవాడిని.. అలాంటి మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపంలో ఇప్పుడు వచ్చింది. ‘పుష్ప’ తర్వాత ట్రైలర్ తోనే నన్ను కథలోకి .. ఆ కాలంలో తీసుకెళ్లిన సినిమా ఇది. ట్రైలర్ చూడగానే డైరెక్టర్ కి కాల్ చేసి అభినందించాను. రవితేజ టాలెంట్ గురించి నాకు తెలుసు. భారతదేశమంతా ఆయన తన కీర్తి పతాకాన్ని ఎగరేయాలని కోరుకుంటున్నాను’ అని అంటూ విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొని వచ్చారు .