తమిళ అర్జున్‌రెడ్డికి ముద్దుల వల్ల పెద్ద సమస్య!!

heroines Objections arjun reddy remake tamil movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విజయ్‌ దేవరకొండ, షాలినిపాండే జంటగా తెలుగులో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఈ సంవత్సరం విడుదలై సక్సెస్‌ సాధించిన టాప్‌ చిత్రాల్లో ఒక చిత్రంగా నిలిచింది. సినిమాలో ఉన్న ముద్దుసీన్స్‌ మరియు యూత్‌ను ఆకట్టుకునే కొన్ని ఆసక్తికర సన్నివేశాల కారణంగా సినిమాకు మంచి ఆధరణ దక్కింది. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తమిళంలో ‘వర్మ’ పేరుతో రీమేక్‌ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ సిద్దం అయ్యింది. హీరో లుక్‌ కన్ఫర్మ్‌ అయ్యింది. కాని హీరోయిన్‌ మాత్రం సమస్యగా ఉంది.

arjun-reddy

‘వర్మ’ చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా చిత్రీకరణకు వెళ్లేందుకు అంతా సిద్దంగా ఉన్నా కూడా హీరోయిన్‌ ఎంపిక కాలేదని, పలువురు హీరోయిన్స్‌ను సంప్రదించినా కూడా ఏవో కారణాలు చెబుతూ నో చెబుతున్నట్లుగా తెలుస్తోంది. కొత్త వారికోసం ప్రస్తుతం దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమాలో లెక్కకు మించి ముద్దు సీన్‌లు ఉంటాయి. అందుకే హీరోయిన్స్‌ ఈ చిత్రంలో నటించేందుకు ఆలోచిస్తున్నారు అనే టాక్‌ వినిపిస్తుంది.

tamil-remake

తెలుగులో దాదాపు 30 సార్లు హీరో హీరోయిన్స్‌ ముద్దు పెట్టుకుంటారు. అది కూడా లిప్‌లాక్‌. అందుకే ఈ చిత్రాన్ని చేసేందుకు ముద్దుగుమ్మలు కాస్త ఆలోచిస్తున్నారు. తెలుగులో షాలిని పాండే, విజయ్‌ దేవరకొండల ముద్దుల కారణంగానే సినిమాకు ఆ స్థాయిలో ఆధరణ దక్కింది. తమిళంలో ఒకటి రెండు ముద్దులు ఎక్కువే పెట్టించాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు ఉన్నాడు. అందుకే ముద్దులకు హద్దులు పెట్టని హీరోయిన్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. మరి షాలిని పాండే వంటి బోల్డ్‌ హీరోయిన్‌ తమిళ ‘వర్మ’కు దొరుకుతుందా లేదా అనేది చూడాలి.